Jump to content

పుట:VrukshaSastramu.djvu/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ను ఇప్పుడెల్ల చోట్లను సేద్యముసేయుచున్నారు. వీనికి రాగిడి నేలలంతగా మంచివి గావు. ఇసుక నేలలలో నీటి ప్రదేశములదు బాగుగా పండును. పొలము దున్ని వర్షాకాలము ముందర విత్తులు చల్లెదరు. మొక్కలు మొలచిన తరువాత నీరంతగా నక్కర లేదు గాని రెండు నెలలకు బంటకు వచ్చుననగా వారమునకు రెండు సార్లు నీరు పెట్టు చుండ వలయును. మొక్కల కొమ్మలు నలు మూలల భూమితో గలయుటకై వానిని ద్రొక్కుదురు. సాధారణముగ 5 నెలలకు బంటకు వచ్చును. అప్పుడు పారలతో దవ్వి కాయలను జేచుల తోడనే రాచెదరు. ఎడ్లచేత తొక్కించిన యెడల కాయలు పగిలి పోవును గాన నీపద్దతి పనికిరాదు. వేరు శనగ పొలము బలమును లాగి వైచును గనుక సదా వానినే పండించుట మంచిది కాదు. అధమ పక్షమున నాలుగైదు సంవత్సరముల కొక మారైనను వానిని మాని రాగుల నైనను మరి ఏనినైనను బండించుట మంచిది. ఈ పంట యైన తరువాత సాధారణముగా జెరువుబెడ్డ నెరువుగా వేసెదరు.

వేరుశనక పైరుల కొకప్పుడు తెగుళ్ళు పట్టుచుండును. కొన్ని పురుగులా పొలములో నుండి యాకులను దినుసు నాకుల మీదనే గ్రుడ్లును పెట్టును. చిన్న పురుగు లాకులో ప్రవవేసించగానె ఆకులన్నియు కుళ్ళిపోవును.