నము తడి పెట్టుచుండవలెను గాని, అటుపైన బదునైదుదినముల కొకసారి నీరు పెట్టిన జాలును. మొక్క లెదుగుచున్నప్పుడవి ప్రాకుటకై వాని ప్రక్కన వెదురు కర్రలను బాతవలెను. నాలుగయిదు నెలలకు బఠాణీలు పంటకు వచ్చును. కొందరు పచ్చి కాయలనే కూర వండుకొని తిందురు. కాని వానిని వేయించి తినుట వాడుక. మినప పప్పుకంటె నివి బలమిచ్చునని గాని అరగవు గాన నందు వలన సార్థకము లేదు. బఠాణీల రొట్ట పశువులకు బలమునిచ్చును.
వేరుశనగలు:- మనదేశములో విరివిగానే పండుచున్నవి. చిట్టి యాకులు అండాకారము; తొడిమలు పొడుగు. వీని మొదటి భాగము వెడల్పుగానుండి కొమ్మ నావరించు కొనును. పువ్వులు సీతాకోక చిలుక వలె నుండును. గర్భధారణమైన పిదప రేకులు వడలి పోవును. తర్వాత రాలి పోవును. కాని పిందెకున్న కాడ పొడగుగా నెదుగుటచే భూమిలోనికి జొచ్చి యచ్చట కాయ పెద్దగ పెరుగు చున్నది. కాయలు చిక్కుడు గిరివింతకాయలవలె బ్రద్దలుకావు.
వేరుశనగలు మొదట మన దేశపుపంటకాదు. ఇతరదేశములనుండి కొని తేబడినను మన దేశములో మెండుగా బండుటచేతను, ఎగుమతి చేయుట వలన లాభము వచ్చుట చేత