పుట:VrukshaSastramu.djvu/193

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనప:- తీగెలు ప్రాకుట కాధారమేమైన గావలయు గావున సాధారణముగ, గోగు, ఆముదము మొదలగు వానితో గలిపి చల్లుదురు. అనుములకు అంతగా నుపయోగము లేదు. వీని యందొక విధమగు వాసన గలదు. అదియును గాక తినినచో నివి సులభముగా నరగవు. వీనిని సాధారణముగ బీదలు మాత్రము తిందురు. పచ్చి అనపకాయలను కొందరు చిక్కుడు కాయల వలెనే కూర వండుకొందురు. వీనిని గూడ ఉలవలె పశువులకును కొన్ని చోట్ల బెట్టు చున్నారు.

బఠాణి పుష్పము... చీలిక, 1, 2, 3, 4, పుష్పకోశాది భాగములు.


బఠాణీలను పూర్వమంతగా బండించెడి వారు కారు. గాని ఈ మధ్య వాని సేద్యమెక్కువ యయ్యెను. ఇవియు రెండవ పంటయె గాని నీరెక్కువ కావలెను. ఎకరమునకు నురువది బండ్లు పేడ వేసి, మూడు నాలుగు సారులు దున్ని మళ్ళు చేసి విత్తనములు చల్లెదరు. మొక్కమొలచు వరకు ననుద