లను బెరుగ నీయక పోవుటయే కాక, మొక్కలకు ముఖ్యముగ కావలసిన ఆహార పదార్థమందు చేర్చును. ఉలవరొట్ట పశువులకు మిక్కిలి బలము. ఈ రొట్టకొరకై సేద్యము సేయునెడల పుష్పింపకమునుపె కోసి వేయవలెను. మిగిలిన మొండెముల తిరిగి చిగురించును. లేదా తిరిగి విత్తనములు జల్లవచ్చును. కాని విత్తనములు చిర కాలము నిలువ యుండును గాన రొట్ట కంటే నివియే లాభము. కొందరు వీని నుడక బెట్టి చిట్టులో గలిపి పశువులకు బెట్టెదరు. మరి కొందరు నానబోసి రుబ్బి పెట్టెదరు. కొందరు బీదలు కూడ నులవ గుగ్గిళ్ళను తిందురు. వీనితో పిండి వంటలను చేసి కొందురు. కొన్ని చోట్ల స్త్రీలు జబ్బులకు వీనినుప యోగింతురు.
బొబ్బరలు:- మంచి నేలందెత్తుగా బెరిగి తీగెలవలె నల్లుకొనును. ఒక్కొక్క పువ్వుల కాడ మీద నీలపు రంగు పువ్వులు కొంచము చొంచెముగా నున్నవి. వీని వాడుక మన దేశము నందు తక్కువ గాన సేద్యమును తక్కువయే. బొబ్బర పప్పును అంత రుచిగా నుండదు. కొందరు పచ్చి బొబ్బర కాయలను చిక్కుడు కాయల వలె కూర వండు కొందురు. వీని యాకుల తోడను రొట్టతోడ ఒక విధమగు నాకు పచ్చ రంగు చేయుదురు.