లనే ఎక్కువ వాడుచున్నాము. మినుములు చాల బలమైన యాహార పదార్థము. దీనితో జేసిన వాసిన కుడుము కొన్ని జబ్బులు నితర యవుషధము లక్కర లేకయే పోగొట్టు నందురు.
శనగలు:- హిందూస్థానము నందెక్కువ సాగు చున్నవి. మన మిచ్చట నులవలు వాడి నట్లు కూడ వారచ్చట శనగలను ఎడ్లకు, గుర్రములకును బెట్టుదురు. వీని నేపద్యమూ ఉలవల నేపద్యము వలెనే యుండును. వీనికిని నీరంతగ అవసరము లేదు. శనగ పైరు మీద మంచు గురుయు చున్న నొక రాత్రి శుభ్రమైన బట్ట గప్పితిమా శనగ పులుసును దాని నంటుకొనును. ఈ పులుసును బట్ట నుండి పిడచి శుభ్రపరచి మందులో వాడుదురు. కాని శనగపులుసు తీసిన చేను గాగుగ బండదు. శనగలను కందులంత వాడము.
ఉలవలు:- హిందూస్థానమున కంటె మనరాష్ట్రమున ఎక్కువ పండు చున్నవి. వీని కంతగా సార వంతమగు భూములక్కర లేదు. మరియు దున్ని విత్తులు జల్లిన పిదప నొక వర్షము కురుసిన చాలును. ఉలవ మొక్కలు రెండు నెలలో బాగుగ నెదుగును. వీని పంట వలన భూసారముమేమియు దగ్గదు. సరి గదా భూమికి బలము వచ్చును. పొలములో చెత్త మొక్క