పుట:VrukshaSastramu.djvu/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మామిడి కుటుంబము


మామిడిచెట్టు మనదేశమునం దంతటను బెరుగు ముఖ్యమౌ వృక్షములలో నొకటి. ఈచెట్లలో జాలరకములు గలవు. మ్రాను, ఎత్తుగను లావుగను బెరుగును. అడుగున నున్న కొమ్మలు అడ్డముగ వ్యాపించును. బెరడు కొంచెము నల్లగానుండును.

మామిడిపువ్వు పెద్దదిగా జూపబడినది.


ఆకులు:- ఒంటరి చేరిక. లఘుపత్రములు. కణుపు పుచ్చములు లేవు. బల్లెపాకారము, కొన్ని సమగోళాకారము, కొన్ని, అండాకారముగ గూడ కలవు. బిరుసుగాను, నున్నగాను నుండును. సమాంచలము, కొన సన్నము, కొన్నిటిలో గుండ్రముగను, కొన్నిటి యందు నాలమును గలదు.

పుష్పమంజరి:- కొమ్మల చివరనుండి రెమ్మగెలలు. పువ్వులు చిన్నవి. కొంచెము పచ్చగను గొంచెము ఎరుపు రంగుగను నుండును. మిధున పుష్పలును, ఏక లింగ పుష్పములును గలవు.