Jump to content

పుట:VrukshaSastramu.djvu/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షధములలో బనికి వచ్చును. కొబ్బరినూనె వలెనె తలకు రాసు కొన వచ్చును. దీని నూనె రాసుకొనిన దల వెండ్రుకలు బగుగ బెరుగు నందురు. లక్క (నిచ్చు) పురుగు దీని యాకుల దిని జీవించగలదు.

ఉల్లెనతీగె:- గుల్మము. కొమ్మల సహాయమున పెద్ద చెట్లపై నెగబ్రాకును. ఆకులు మిశ్రమ పత్రములు. వీనికి నిద్ర గన్నేరు ఆకుల వలె స్పర్శ జ్ఞానము గలదు. గింజ పై హృదయాకారముగ తెల్లని అచ్చ యుండును. ఈ మచ్చను బట్టి దీనిని సులభముగా గుర్తింప నగును.

అరిష్ట:- చెట్టు పెక్కు చోట్ల నిరువది యడుగులెత్తు పెరుగు చున్నది. దీని కాయలను గుంకుడు కాయలవలెనే వాడుదురు.

విష రాసి:- కొండల మీద పెరుగును. దీని మాను చాల పొడుగుగాను లావుగాను నుండును. కలపయు గట్టిగా నుండును గాన అన్ని పనులకు బనికి వచ్చును.

తాటకి:- చెట్టు కొండలమీద పెరుగును. దీని పండ్లు తిందురు. వేళ్ళతో విరేచనములు కట్టుటకు మందు చేతురు.

కొరవి:- చెట్లు కొండలమీద నుండును. కీని కలప తెల్లగా నుండును గాని అంత మంచిది గాదు.