వి. ఇవి వాని కెదురుగా నుండును. వీని మధ్య నొక పళ్ళెరము కూడ గలదు. అండాశయము నందు గదులు ఆరు వరకు గలుగు చుండును. కొన్నిటిలో కీలము పొట్టిగా నున్నది. కొన్నిటిలో నది లేదు. ఫలము కండకాయ.
ద్రాక్షతీగెలు:- విరివిగా శీతల దేశములలో బెరుగును. వానికి తేమగాలి కూడదు. చెన్న రాజ్యమునందు వాని పంట మిక్కిలి తక్కువ. మన దేశము యొక్క యితర భాగములలో నచ్చటచ్చట బెంచు చున్నారు. ద్రాక్షపండ్లలో చాల రకములు గలవు. తీగెలను విత్తుల మూలమున గాక, కొమ్మలను గోసి, వానిని పాతియే పైరు చేసెదరు. ఒక యడుగు పొడుగుగా నున కొమ్మ మీద సుమారు నాలుగైదు మొగ్గలుండ వచ్చును. కొమ్మలను అడ్డముగా బాతిన తరువాత అమొగ్గలే మొక్కలుగా వచ్చును. అవి సుమారు తొమ్మిది అంగుళములు ఎత్తుగా నున్నప్పుడు వానిని దీసి, జనుముతో దమ్ముచేసి, ఎరువు వేసిన తోటలలో బాతుదురు. వానికి నాలుగైదు దినముల కొక మారు నీళ్ళు పోయుదురు. ఎదిగెడుతీగెలు ప్రాకుటకు దగ్గరనేమైన పాతవలెను. తరుచుగా బాడిద కొ