పుట:VrukshaSastramu.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్మలను బాతుచున్నారు. 5 అడుగులెత్తు ఎదిగిన తరువాత తీసి గెల చివరను కత్తరింతురు. అందుచే ప్రక్కల నుండి కొమ్మలు బయలు దేరును. వీనిలో కొన్నింటిని మాత్రముంచి మిగిలిన వానిని కత్తరించి వైతురు. కత్తిరించిన నాలుగైదు వారములకు పువ్వులు పూసి కాయలు కాయ నారంభించును. పూసినప్పటినుండియు నీరు పోయ వలెను.

అంగళ్ళ యందు ఆమ్ము కిసిమిసిపండ్లు ద్రాక్ష పండు వేరు వేరు రకములు. ఈ పండ్లను ఔషదములలో వాడు చున్నారు. వీని నుండి సారాయి బ్రాందిని కూడ దీయుదురు.

నల్లేరు:- చెట్టు మీద బ్రాకు చుండును. దీనికిని నులి తీగలు గలవు. ప్రకాండము ఆకు పచ్చగ నున్నది. లేత కొమ్మలను ముక్కలు ముక్కలుగా గోసి, ఎండ బెట్టి నీళ్ళలో గాచి ఆ ముక్కలను రెండు మూడు మారులు సున్నపు నీటిలో కూడ కాచుదురు. అప్పటికి వాని దురద పోవును. ఆ మందును పంచదార నీళ్ళలో కలిపి, అజీర్ణమును బోగొట్టుటకు నిత్తురు. కొన్ని జబ్బులకు నల్లేరుతో పడియములు బెట్టి వానిని అన్నములో గలుపుకొని తిందురు.

బఱ్ఱిబచ్చల:- చాల చోట్లనే పెరుగు చున్నది. దీని ఆకులను గాచి కురుపులకు త్వరగా చితుటకు పట్టు వేయుదురు.