పుట:VrukshaSastramu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పారకి:- పెద్ద తీగె. ఆకులపై నెత్తుగ మెత్తని రోమములు గలవు. పువ్వులకు తొడిమలు లేవు. కాయ నల్లగ నుండును. దీనిని తినవచ్చును.

గోటి:- చిన్న చెట్టు. ఆకులు కొంచము గుండ్రముగ నుండును. అంచున సన్నవి రంపపు పండ్లు గలవు. వానిపై మెత్తని రోమములు గలవు. దీని కలప నారింజ రంగుగను గట్టిగా నుండును.


ద్రాక్ష కుటుంబము

ఇది యొక చిన్నకుటుంబము. ఇందులోని మొక్కలు చాల భాగము నులి తీగెలమూలమున బ్రాకునవియె. ఈ నులితీగె లాకుల కెదురుగనున్నవి. ఇవి ప్రకాండము యొక్క మారు రూపములు గాని యాకుల యొక్క మారు రూపములు గావు. ప్రకాండము పలకలుగా నుండును. ఆకులు ఒంటరి చేరిక. లఘు పత్రములు. వృంతము మీదను కొన్నిటిలో నులి తీగెలు గలవు. అది పూర్తిగ నట్లు మారుటయు గలదు. పుష్పములు మిధునములే కాని, కొన్నిటిలో మాత్ర మేక లింగ పుష్పములున్నవి. ఆకర్షణ పత్రములు నాలుగో, అయిదో యున్నవి. అవి మొగ్గలో నొక దాని నొకటి తాకు చుండును. కింజల్కములు ఆకర్షణ పత్రము లెన్ని గలవో, అన్నియే యున్న