పుట:VrukshaSastramu.djvu/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

151

గలుగు చున్నవి. పువ్వులు సరాళము. పుష్పకోశమునకు 3...5 తమ్మెలు గలవు. అవి అల్లు కొనియైనను, తాకుచు నైననుండును. ఆకర్షణ పత్రములు 3...5 ఇవి యు మొగ్గలో బుష్పకోశపు తమ్మెలుండినట్లే యుండును. కింజల్కములు, ఆకర్షణ పత్రములన్ని గాని, అంతకు రెట్టింపుగాని యుండును. కొన్నిటిలో మాత్రము అసంఖ్యములుగా నున్నవి. కాడల కడుగున నొక పొలుసుండిన నుండును. పుప్పొడి తిత్తులు నిడివి చౌకపు నాకారము. అండాశయములో నండము ఒకటియే యుండును.

మద్ది పాలు చెట్టు బెరడును ఔషధములలో వాడుదురు. ఈ చెట్లనుండి గుగ్గిలము వంటి పదార్థమొకటి వచ్చును. బెరడున కంటె నిదియే మంచి పని చేయును. ఇది నీళ్ళలో గరుగదు. కొన్ని ద్రావకములలో గలిపి మూత్ర వ్యాధులు, శెగ దగ్గు,. జిగట విరేచనములు మొదలగు జబ్బులకిత్తురు.

గార చెట్టు
- రాతి నేలలందు బెరుగును. దీని పండు గుంజు కాకిమర్రిపండు వలెనే చర్మ వ్యాధులకు బని చేయును.

మైసాక్షి కుటుంబము.


ఈ కుటుంబమునందు జెట్లును, గుబురు మొక్కలును గలవు. ఆకులు, ఒంటరి చేరిక, మిశ్రమ పత్రములు