పుట:VrukshaSastramu.djvu/160

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

152

చిట్టి యాకులు గలసి యైనను, విషమభిన్నముగ బక్షపైఖరినైన నుండును. పువ్వులు చిన్నవి. సరాళము మిధున పుష్పములు ఏక లింగ పుష్పములు కూడ గలవు. పుష్ప కోశమునకు 3...6 తమ్మెలుండును. ఇవి మొగ్గలో నల్లుకొని యైనను ఒక దానికొకటి తాకుచునైన నుండును. ఆకర్షణపత్రములు 3...6 గలవు. కొన్నిటిలో మాత్రమడుగునందు కలసి యున్నవి. కింజల్కములు ఆకర్షణ పత్రములన్నియో అంతకు రెండు రెట్లో యుండును. కొన్నింటిలో నవియన్నియు సమముగా లేవు. అండాశయములో 2..5 గదులున్నవి. సాధారణముగ రెండేసి అండములుండును. స్థంభ సంయోగము. ఫలము ఎండు కాయ, పగులదు.

మైసాక్షి చెట్లు హిందూ స్థానమునందెక్కువ బెరుగు చున్నవి. శీతాకాలమందు వానిమీద నాట్లు పెట్టిన యెడల జిగురు వంటి పదార్థము వచ్చును. అది పరి సుభ్రముగా నున్న యెడల గొంచము పచ్చగా నుండును. దీని నౌషధములలో వాడుదురు. ఇది మిక్కిలి చేదుగానుండును గాన లోపలకు పుచ్చుకొనలేరు. కడుపు ఉబ్బుట ఎక్కిళ్ళు మొదలగు వానికి దేహముపైన రాతురు. అది శరీరమునుగట్టిగా నంటు కొనును.