పుట:VrukshaSastramu.djvu/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరివేతుము. ఇవియే దానికిగావలసినది. కాయ అచ్చటబడి మొలచును. ఈ రీతినే అవి వ్యాపించును. ఉత్తిరేణి కాయలు మన బట్టలకును, గొర్రెలు, మొదలగు వాని శరీరమునకు నంటు కొని వ్యాపించు నట్లు నివియు వ్యాపించుచున్నవి.

ఎండుకాయలకషాయమును, పచ్చియాకుల రసమను మూత్రవిసర్జనమప్పుడు కలుగు మంట శుక్ల నష్ణము మొదలగు బాధల నివారించుటకు వాడుదురు.


బిలిబిలికాయ కుటుంబము.


ఈ కుటుంబములో జాల భాగమన్నియు గుల్మములే. ఆకులకు కణువు వుచ్చములుండును. ఒంటరిచేరిక, లఘుపత్రములును, మిశ్రమపత్రములును గూడ గలవు. వాని పై రోమ ముండును. పుష్పములు సాధరణముగ సరాళముగానే యుండును. పుష్పమునందు బ్రతి వలయము నందును నైదేసి కలవు. అయిదు రక్షకపత్రములు అయిదు ఆకర్షణపత్రములు, వలయమున కైదు కింజల్కముల చొప్పున రెండు వరుసలూ అండాశయము నందు నైదు గదులు అయిదు కీలాములును గలవు. కాయ ఎండుటయు పెక్కువానియండ విచ్చెడుకాయ.