Jump to content

పుట:VrukshaSastramu.djvu/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డ్లుగా మారి యున్నవి. మిశ్రమ పత్రములు. రెండు మూడు చిట్టియాకులు గలిగి యుండును, కొన్నిపక్షవైఖరి నున్నవి. ఒక్కొక్క కణుపునుండి ఒకటో రెండో పువ్వులు వచ్చు చున్నవి. సరాళముగా, అసరాళముగాను గూడనుండును. ఈ పువ్వులలో తెలుపు, ఎరుపు, పశుపు తప్ప వేరు రంగు లేదు. రక్షక పత్రములు 5, కొంచెము కలిసి యుండిన నుండును. ఆకర్షణ పత్రములైదు. ఇవి కొన్నిటిలో మాత్రములేవు. పువ్వులో పళ్ళెరము గలుగు చున్నది. కింజల్కములు, ఆకర్షణ పత్రములన్నిగాని, వానికి రెండు మూడు రెట్లుగాని యున్నవి. ఇవి ఆకర్షణ పత్రముల నంటి యున్నవి. కింజల్కముల కాడల మీద బొలుసు కూడ కలదు. అండాశయము ఉచ్చము. నాలుగైదు గదులుండును.

పల్లేరుమొక్క:- గడ్డి పెరుగు ప్రతిచోటను బెరుగ గలదు. అది నేల మీదనే బడి యుండి గడ్డిలో గలసి మనకు గోచరము కాదుగాని, ముళ్ళు గ్రుచ్చు కొనుట వలన నది యున్నట్లప్పుడు గ్రహింతుము. ఆముళ్ళు కాయలకున్నవి. మన కట్లు గ్రుచ్చుకొనుట వలన దానికి లాభమే గలుగు చున్నది. కాయల మీద ముండ్లును అట్లు గ్రుచ్చు కొనుటకే ఏర్పడు చున్నవి. మన కాలిలో గ్రుచ్చుకొనిన యెడల దీసిదూరముగ వి