లెనె కాయలుగాయగానె ఎండిపోవును. దాని గింజలను, గింలనుండి తీసిన చమురును ఔషధములలో వాడుదురు. ఇవి రెండును, అన్నిరకముల మూత్ర వ్వాధులకును బని చేయును. మరియు పుండ్లకు గాని నొప్పులకు గాని పట్టు వేసిన దగ్గును.
అడవిగోరింట: ఒక్కయు చిన్నదియె. ఇది పడమటి కనుమల ప్రాంతముల ఎక్కువగా బెరుగు చున్నది. దీని కొమ్మలను నీళ్ళలోనుడక బెట్టి ఆ కషాయములో గొన్ని మందులు కలిపి జిగట విరేచనములు, అజీర్ణము, ఉబ్బు జబ్బులకు నిత్తురు.
ఆసుపత్రులందు శస్త్రములు చేయు నప్పుడు నొప్పి పెట్టకుండ రాచెడు కొకేను ఈ కుటుంబములోని యొక మొక్క ఆకుల నుండి చేయుచున్నారు. ఆ మొక్కలు మన దేశములో నొకటి రెండు చోట్లనే పెంచు చున్నారు కాని ద్రవము తీయుట కు బై దేశములకే పంపు చున్నారు.
పల్లేరు కుటుంబము.
ఈ కుటుంబపు మొక్కలు మన దేశములో నంతగా లేవు. దీనిలో గుల్మములు, గుబురు మొక్కలేగాని పెద్ద చెట్లు లేవు. ఆకులు అభిముఖము చేరిక, ఒంటరి చేరిక, కూడ గలదు. వీనికి కణుపు పుచ్చములున్నవి. కొన్నిటిలో నివి ముం