Jump to content

పుట:VrukshaSastramu.djvu/155

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బిలిబిలి:- చెట్టును దోటలందుబెంచు చున్నారు. దీని పండ్లు మందులలో నుపయోగపడుచున్నవి. పండ్ల రసము దీసి పంచ దారయు నీళ్ళునుగలిపి సన్నని మంట మీద జిక్క బడువరకు గాచి,ఇత్తురు. మూల శంకకును, రక్త విరేచనములకూ గుణమిచ్చును.

తామర్త:- చెట్టును దోటలందు బెంచు చున్నారు. వీని కింజల్కము లడుగున కలిసి యున్నవి. దీని కాయలు గూడ మూల శంఖకు గుణమిచ్చును.

పులిచింతాకు:- మొక్క నీటి వార నేల మీద బ్రాకుచుండును. ఆకులలో మూడేసి చిట్టి యాకులున్నవి. దీని యాకులు నీళ్ళతో గిలిపి కాచి, వాచి పొక్కు లెక్కిన చోట్లను బట్టు వేసిన యెడల దగ్గును. ఆకులతో గూర వండి తినిన అన్నహితవును గలుగును.

నీరుగన్నేరు:- మంచినీళ్ళ తీరమున బెరుగును. ఆకులకు దొడిమ లేదు; లఘుపత్రములు. పువ్వుల సరాళముగ నుండును; కాని చాల అందముగ నుండును.


నారింజ కుటుంబము.


నారింజ చెట్టు మన దేశములో పలు చోట్లనే పెరుగుచున్నవి. ఇది చిన్న చెట్టు. కొమ్మల మీదముండ్లున్నవి.

ఆకులు:- ఒంటరి చేరిక. లఘుపత్రమునలెనున్న మిశ్రమపత్రములు;