Jump to content

పుట:VrukshaSastramu.djvu/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాల:... చిన్న మొక్క. మ్రానువంకరలుగా నుండును. ఆకుల యడుగున మెత్తని రోమములు చాల గలవు. పువ్వులు పచ్చగానుండును. దీని నుండియు నార వచ్చును.

ఎర్రసాలబర్త:... గుబురు చెట్టు. ఒక్కొక్కచో నొక్కొక్క పుష్పముండును. కాయలు గుండ్రముగా నుండును. తెల్లని పువ్వులు పూసెడు రకమును గలదు.

సాలబర్త:... గుబురుమొక్క. ఏదైన ఆధారముండినగాని యెత్తుగా బెరుగలేదు.

కొండపట్టి:... కొండలమీద బెరుగును. ఆకులకు మూడు తమ్మెలు గలవు. వర్షాకాలములో పుష్పించును.

కొండగంగ:... కొండల మీద బెరుగుచిన్న చెట్టు. పువ్వులు పెద్దవిగా, గులాబి రంగుగాను నుండును. దీని నారయు బాగుండుడును.

పద్మచారిణి:... చెట్టు తోటలందు బెంచుదురు. దీనికి పువ్వులు ముద్దపువ్వులు కూడ గలవు. వువ్వులు ప్రాతః కాలము నందు వికసించి తెల్లగా నుండును. కాని క్రమక్రమముగ సాయంత్రమున కెర్రబడును.