Jump to content

పుట:VrukshaSastramu.djvu/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నయెడల నంత మంచి నారరాదు. మొక్కలను గోసి కట్టలుగట్టి నీళ్ళలో నూర వేసి జనుపనార దీయుదురు. ఈ నారయు జనుపనార వలెనే నుండును గాని కొంచెము ముతక గా నుండును. అయినను జాల వస్తువులు చేయుటకే నుపయోగించు చున్నారు. వలలకు జనుప నారకంటే నిదియే మంచిది.

దీని యాకులు పుల్లగానుండును. వీనితో బచ్చడి పులుసును జేసికొందుము. ఒక రకము ఆకులెక్కువ పుట్లగా నుండును.

మందారము:.... (దాసాని) మొక్క ఎర్రని పెద్ద పువ్వులను బూయుటచే దోటలందు బెంచుచున్నారు. పువ్వుల నౌషధములలో వాడుదురు. వాని నుండి ఒక విధమగు నెర్రని రంగును వచ్చును. ఈ మొక్కలనుండి కూడ నార వచ్చును.

జూకామందారము:... పై దానివలెనే నుండును గాని పువ్వుల రేకులు చీలి చీలి యున్నవి. కింజల్కముల గొట్టము పొడుగుగానుండును, పువ్వులకాడ పొడుగుగానుండుటచే వంగి యుండును.