Jump to content

పుట:VrukshaSastramu.djvu/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లు. కొన్నికొన్ని కలిసి ఏర్పడినకట్టలు మూడు మొదలు ఆరు వరకు నుండును. వర్షకాలమునందే పుష్పించును.

తూటిబెండ:.... మొక్కయు బలుతావులనే పెరుగు చునది. సంవత్సరము పొడుగున బుష్పించు. కాయ ఇరువదింటిక్రింద విచ్చును.

నూగుబెండ:.... కొంచము పెద్దమొక్కయె. పువ్వుల రేకులు వంకరగాను, త్రిభుజాకారముగను నుండును. ఈ నాలుగు బెండలను బెండ జాతిలోనివి గావు. బెండ కాయ ఎండి పగులును. గింజలు బైటికి వచ్చును. వీని కాయలు నెండి విచ్చును గాని గింజలు పైకి వచ్చు నట్లు పగలవు. కాయలో నున్న గదులు మాత్రము విడిపోవును. ఇవి పగులవు వీని లోపలనే గింజ గలదు.

గోంగూర:.... మనదేశములో జాల చోటుల బెంచు చున్నారు గాని, ఆకులనుపయోగించుటకే గాదు, దాని నుండి మంచి నార వచ్చును. ఈ నారకై పైరు చేయు చున్నారు. దీనిని పెంచుటయు గష్టము లేదు. ఇతర పైరుల తోడనే గోగు గింజలను చల్లెదరు. నార దీయుటకైనచో పుష్పించి కాయలుగా నైన పిదప జెట్లను గోయవలెను. పుష్పించు చుండగా గోసి