Jump to content

పుట:VrukshaSastramu.djvu/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గంగరావి:... పెద్ద చెట్టు. మనదేశములో జాల చోట్ల మొలచు చున్నది. దీని కాయలలో బచ్చని రసముగలదు. చీడ మొదలగు చర్మ వ్యాథులు కొన్ని ఈ రసము రాసినచో దగ్గును. బెరడు కషాయము గూడ నుపయోగింతురు.

మునిగంగరావి:... చెట్టును పై దానివలెనే యుండును. దీని ఆకులకు వాలము గలదు.

పల్లెమంకెన:... గుబురు మొక్క. ఆకులకు తాళ పత్ర వైఖరిని తమ్మె లున్నవి. దీని నుండియు మంచినారవచ్చును.

చిట్టిమూతి:... మొక్క తేమ నేలలందు మొలచును. దీని వేరు కషాయమును అజీర్ణమునకును, నీరసము బోగొట్టుటకు నిత్తురు. తరచుగా నల్లము రసముతో గలిసి కొంచెమిత్తురు గాని కొంచెము కొంచెమిచ్చుట వలన లాభమంతగా లేదు.

ఎర్రగోంగూర:... గింజలను నూరి నీళ్ళలో గలిపి వడకట్టి నీరసమునకును, మూత్ర విసర్జన మప్పుడు నొప్పులకు నిత్తురు.

అతిబల:... మొక్క చిన్నది. దీని యాకులు వంకరగా నుండును. దీని నుండి మంచి నార వచ్చును. ఈ నారను బరీక్షిం