పుట:VrukshaSastramu.djvu/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

107

చెట్టునుండి కోయగనే ఆకు కాచి త్రాగుటకు బనికి రాదు. పచ్చిగానున్నప్పుడు దాని యందు బసరువాసన తప్ప మరేమియు లేదు. దానిని సిద్ధము చేయుటకు తంతు చాల గలదు. అదంతయు గొంత కాలము వరకు జేచితోడనే చేయుచు వచ్చిరికాని, తరువాత తరువాత యంత్రములను గల్పించి వాని సహాయమున సులభముగా జేయుచున్నారు.

ఆకునుగోసి తేగానె చల్లని చోటను నెండ దగులని చోటను వానిని పలుచ పలుచగా నార బోతురు. ఆకు సాధారణముగ నిరువది గంటలలో వడలును,. ఇంతకంటె నెక్కువ కాల మట్లుంచిన యెడల మంచి వాసన పోవును. కాని యెక్కక్కప్పుడు అంత వడల కుండ నున్న యెడల మరి కొంత సేపట్లుంచవలయును. వడలిన యాకును దీసి యొక బల్లమీద వేసి యంత్రములు రాక పూర్వము చేతులతో రాసెడి వారు. ఆరాపిడి తగులుటవలన ఆకులోనున్నపసరు కొంచెము పైకి వచ్చును. ఎక్కువ రసము వచ్చిన కొలదిఘాటుటెక్కువ యగును. ఆకునకు గాలి సోకాగనే వాని యందు కొన్ని మార్పులు గలుగు చున్నవి. ఆకంచునందు గోథుమ వర్ణముగా నగును. ఆఆకును దీసి మిక్కిలి పరిశుభ్రముగను, చల్లగను తేమగ నున్న చీకటిగదులలో సంగతి సందర్భములను బట్టి రెండు మొదలు ఆరు గంటలవరకు బెట్టుదురు. అప్పటికి తే