1-8
యాకునకు సువాసన వచ్చును. అట్లెంత కాల ముంచ వలెనో కొంతెమనుభవ మున్న యడల ఆకును జూడగనే చెప్పవచ్చును.
తరువాత ఆకునంతయు దీసి వెచ్చబెట్టెదరు. ఇట్లు వెచ్చబెట్టుటకును యంత్రములు గలవు. మిక్కిలి వేడిగా నున్న గాలిని యాకులపై బారనిచ్చెదరు. ఆకు మూడు వంతులు తడి యారిన పిదప వేడిని తగ్గింతురు. అటు పిమ్మట దాని దీసి జెల్లెడవంటి దానిలో బోసి నొక్కుదురు. ఆకంతయు సమముగా తెగును. జల్లెడ కంతలు సన్నముగా నున్న యెడల ముక్కలును సన్నముగానే యుండును. ఆకును రకములవారిని నేర్పరచి పెట్టెలలో బెట్టి యంగళ్ళకు బంపుదురు. ఈ పెట్టెల కన్ని రకములు చెక్కలు పనికి రావు. కొన్ని చెక్కలకు సువాసనను తగ్గించును. వానిలోపల పలుచని సీసము రేకు వేయుట మంచిది. మరియు ఆ పెట్టెలకు మూత గట్టిగా నుండవలెను గాని లేనిచో గాలి బీల్చుకొని వాసన తగ్గును. తేయాకును జేయుటకు మరికొన్ని పద్ధతులు గలవు. కొన్నిచోట్ల ఆకును కోయగనే అరబోయక వెచ్చబెట్టుదురు. పైన చెప్పినదే మనదేశములో విశేషముగ నున్న పద్దితి.
ఆంగ్లేయ సంపర్కము తగిలిన యప్పటినుండి ఇంగిలీషు విద్య వ్యాపింప నారంభించి నప్పటినుండియు మనము