పుట:VrukshaSastramu.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

వున కొమ్మ మీద నింకను లేతరెమ్మలు వచ్చునట్లు చూడవలెను. కావున ఆ రెండాకుల నుంచి బొటనివ్రేలు గోరుతో ఆ చిగురు త్రెంపి వేయుదురు. అట్లు చేయుటవలన, మిగిలిన యాకుల వద్ద నుంచి రెమ్మలు బయలు దేరును. మధ్య కొమ్మమీద నెంతయెత్తున నున్న యాకులను బెరికితిమో చుట్టు నున్న కొమ్మల మీద కూడ అంత యెత్తున నున్న వానినే బెరుకుట మంచిది. ఈ విధమున ఆరేడు మారులు కూడ చిగుళ్ళను త్రుంప వచ్చును. అట్లు త్రుంపుటలో పెద్ద యాకును నొక్కటయిన మిగిల్చి త్రుంపుట మంచిది.

మొక్కలను బాతిన మూడు నాలుగేండ్లలో ఆకంతగా రాదుగాని , ఆరవ యేటి నుండి అయిదు వందల పౌనులు ఆకు వచ్చును.

ఈ మొక్కలకు అరిష్టములును జాలకలవు. పురుగులు పట్టుచుండును. అవి వేసవి కాలమం దాకులరసము పీల్చివేయును. కొన్ని రకముల బూజు కూడ వీనిలో ప్రవేశించును. కొన్నిటిపై గంధకపు పొడియు, గొన్నిటిపై సున్నము, గంధకము కలిసి కాచిన నీరును చల్లుదురు. వాని వలన కొంచెము నయమగు చుండును.