Jump to content

పుట:VrukshaSastramu.djvu/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

101

న గలుగు కష్ణమును బోతొట్టుటకు మన దేసమునందు గూడ ఆమొక్కలను బెంపవలసినది మొదట, ఈస్టిండియా కంపెని వారు గవర్నరు జనరలగు వారను హేస్టింగునకు దెలియ జేసిరి. కాని అప్పుడెందు చేతనో అశ్రద్ధయయ్యెను. బెంటింగు ప్రభువు వచ్చిన తరువాత తేయాకు పైన శ్రద్ధ హెచ్చెను. చీనా దేశమునకు గొందరును బంపి, మొక్కలను, గింజలను దీని సంగతెరిగిన యా దేశస్తుల గొందరును రప్పించి హిమాలయ పర్వత ముల వద్దను, అస్సాములోను దాని నాటించెను. ఈ లోపుననే అస్సాములో తేయాకు మొక్క పెరుగు చున్నట్లు కాన వచ్చెను. దాని సంగతి తెలియ జేయవసయునని ప్రభుయ్వము వారు కొందరిని నియోగించిరికాని, వారిలో వారికి యభిప్రాయ భేదము రాగ నేసంగతియు జాల కాలము వరకు దేల లేదు. తరువాత ఈ మొక్కల యాకును బాగుండుట గని దీనిని పైరు చేయ గవర్నమెంటు వారంగీకరించిరి. కాని కొంత కాలమైన తరువాత యా వ్యాపారమంతయు నమ్మిచేసిరి. దీని మూలమున గవర్నమెంటు వారికి చాల ధనము వ్వయమై యుండ వచ్చును. కాని తేయాకు మూలమున, నదివరకు నేవ్వయములో లేని అయుదు లక్షల యెకరము లిప్పుడు వ్యవసాయములో నున్నవి, 600,000 మంది జనులకు ఉద్యోగములు గలిగినవి. ఇప్పుడు తేయాకు మీద పెట్టుబడి 300,000,000 రూపాయలు.