పుట:VrukshaSastramu.djvu/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

తేయాకు మొక్క నుండి మనకు గావలసినది లేత యాకులే. సంవత్సరము పొడవున లేత యాకు దొరకుట దుర్ఘటమే కాని సాధ్యమైనంత వరకు అది చాల వచ్చునట్లు జూడవలెను. తేయాకును మొట్టమొదట పైరు చేసి నపుడు కొందరు హిమాలయ పర్వతముల మీద బాగుగ బెరుగు ననియు కొందరు అస్సాములో బాగుబ పెరుగు ననియు చెప్పుచు వచ్చిరి. కాని నిజమైన సంగతి, యా మొక్కలు యన్ని చోట్లను బెరుగ గలదు. దానికి విస్తారము శీతలమ క్కరలేదు. ఉష్ణమును అంతగా కూడదు. తరచుగా వర్షములు మాత్రముండ వలెను. నేలయు సాధారణముగ నుండవలెను గాని మిక్కిలి గట్టిగ నున్నచో వేళ్లు బారుట సులభము గాదు కనుక, అట్టి చోట్ల బెరుగలేదు. నేలలో విస్థారముగ తేమ నుండ రాదు. నీరింకుచు సార వంతముగనున్న నేలలేవైన పనికి వచ్చును. ఎండకు నెండి పగులుచు, నీరింకనీయని నేలలు బొత్తుగా పనికి రావు.

తేయాకు మొక్కలను గింజలు పాతియే పైరు చేయుదురు. కొమ్మలు పాతి పెంప జూచిరి గాని, అవి వేళ్ళు బారి పెరుగుట కష్టమయ్యెను. దీని విత్తనములకై, కొన్ని చెట్ల యాకులను కోయక వానినెదుగ నిత్తురు. అవి ముప్పది నలుబది