పుట:VrukshaSastramu.djvu/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

నేబ్రారంభించి నపు డీపుస్తక మీరూపము దాల్చునని యనుకొనలేదు. ఉపయోగించు మొలకలను గూర్చియే వానియానవాళ్లు, ఉపయోగములు మొదలగు విషయములను గూర్చియే - వ్రాయమొదలుపెట్టి విజ్ఞానచంద్రికా మండలి వారికి అది చూపితిని. శాస్త్రగ్రంథ ప్రకటనము వారికి ముఖ్యముగావున దత్సంబంధమగు నితర విషయముల నందు జేర్పుమనిరి. మరియు వారొకటియు, రంగాచార్యులు గారొకటియు వృక్షశాస్త్రములను ప్రకటించుయుండుటచే దిరిగి యట్టిదానినేవ్రాయ సమంజసము కాదనిరి. కాని, యందలి ప్రాథమికాంశముల నిందును విడనాడకుండుట వాంచనీయము. 'కుటుంబముల ' నిప్పటియట్లు శాస్త్రీయముగగాక, అకారాది యక్షరక్రమమున మొదట ముద్రింపించ దలచుకొనిరి. ఇట్లు గ్రంథోద్దేశము క్రమక్రమముగ బేధించుటచే నిందు సమతలేని దోషంబొకటి కాన్పించునేమో. దానిని మన్నింతురుగాక !

ఇందలి పరిభాషను క్లుప్తముగా నుదాహరణములతో నుపోధాతమందు విశదపరచితిని. గ్రంథమందు జిన్నయక్షర