పుట:VrukshaSastramu.djvu/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ములలో ముద్రించియున్న వర్ణనలను సుబోధకము చేసికొన గోరువారు దానిని అవశ్యము చదువవలయును.

పరిభాషలో మ.రా.రా. ఆచంట లక్ష్మీపతిగారి జీవశాస్త్రమును, రంగాచార్యులుగారి ఔషధిశాస్త్రమును, దోడ్పడినవిగాని కొన్ని కారణములచే నందలి పేరులను కొన్నిటిని మార్పవలసి వచ్చెను.

నేజెప్పదలచుకొనిన దితరులకు సులభముగ దెలియుటయే ప్రధానముగ నెన్నుకొంటినిగాని వ్యాకరణ యుక్తముగ నుండవలెననియే కాదు. అదిగాక, అచ్చొకచోటను, నేనొకచోటను నుండుటచేతను, అచ్చుపని త్వరగ ముగించు భారము నాపైబడుటచేతను నేననుకొనని దోషములుకూడ నిందుగొన్ని జొచ్చినవి.

ఇందలి బొమ్మలు చాలభాగ మితర పుస్తకములనుండి గైకొనబడినవే. చూడ గుతూహలమయ్యెడు వ్ర్క్షముల బొమ్మలును, శాస్త్రపఠనమున కవశ్యములైన బొమ్మలును గైకొనబడినవి. వీనిదిమ్మలు రెండు మూడు సారులు స్థలము మారుటచే కొన్ని కనుబడకుండ బోయినవి. అయిన నవిలేని నష్టమంతగ నుండదనియే తలచెదను.

ఈపుస్తకమును, ముఖ్యముగ నిందలి వర్ణనలను, చదువునపు డాయామొక్కలను దగ్గరనుంచుకొని బరీక్షించు