పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

71


కాని, యట్టి వాఁడున్నచో నతని శిక్షింప వలయుననుట యందు మాత్ర మందఱు నేకీ భానము వహింవిరి. కాని యా ద్రోహియే బయల్పడ లేదు. కొందఱు చక్రధరుఁడు కావచ్చు నను కొనిరి. మఱికొందఱు మఱియొకడనిరి.కాని వారిలో జాల మంది భావములు మాత్రము బుద్ది సాగరుఁడట్లు చేసియుండునని యూహింపలేదు. పౌరులకు బుద్ధిసాగరుఁడు తండ్రివంటి వాఁడు. వారతనియందు మిక్కిలి విశ్వాసముగల వారగుటకు, అతఁడు వారికిఁ జేయు మేళ్ళే కారణములు. ఆతఁడు నారినంతగాఁ బ్రేమించెను. కాని యతనికి నున్నతోద్యోగములయందున్న వారిలో మాత్రము చాల మంది విరోధులుకలరు. అతఁడున్యాయైక పక్ష పాతి. లంచములు పట్టుటగాని యొకరి సలహాలు విని తగని వారి కున్నతోద్యోగముల నిచ్చుటగాని, యతని 'కెంతమా త్రమును గిట్టదు. ఇది వారికిఁ గష్ట దాయకము. రాజులకుఁ “దావలచినది రంభ, తామునిగినదిగంగ' యనుట స్వభావము. వారికి మంచి చెడ్డలు వివేచించు జ్ఞానము మొత్తముమీఁద మిక్కిలి తక్కువగా నుండును. స్తోత్రపాఠకుల పాఠములకుబ్బి తబ్బిబ్బగు చుందురు.

ఆదిల్శాహాను జేరఁ దీసినదాది పెక్కు సార్లు బుద్ధిసాగరుఁ డది మంచిది కాదని యేకాంతముగాఁ జెప్పెను. అతనిని ద్రికరణం శుగా నమ్మిన రామరాజున కిది కష్టము కాఁజొచ్చెను. ఒకటి రెండు సార్లతని ప్రత్యక్ష కోపమునకుఁ గూడ నితఁడు గుఱి