పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

విజయనగర సామ్రాజ్యము


యగుట సంభవించెను. ఆత్మ దేశ రక్షుక చిత్తుఁడును, విధి నిర్వహశైక దృష్టియు నగు బుద్ధాసాగరుఁడు దానిని లెక్క పెట్ట లేదు. కాని తన మాటనే యనుసరించి యదియే సత్యమని యనకుండుట రామరాజునకుఁ గష్టముగా నుండుచు వచ్చెను. అది యితఁడు కని పెట్టక పోలేదు. కాని న్యాయమార్గమును వీడుట కతని కిష్టము లేదు. ఇట్టి చిక్కులు కొన్ని యితరములగు నాంత రంగిక కార్యములలోఁగూడ సంభవించెను. అందును మన బుద్ధి సాగరుఁడు మనస్సాక్షికి దూరముగ నర్తించియుండ లేదు. సభయంతయుఁ దుపానుచే క్షోభింపఁచేయఁబడిన మహాసము ద్రమువలె నుండెను. రామరాజు ముఖమున రోషానలజ్వా లలు మండఁజొచ్చెను. అతఁడు లేచి స్వయముగాఁ దన చేత నున్న యుత్తరము నిట్లు చదువఁదొడఁగెను.

'మహారాజాధి రాజులును, అనేక బిరుదావళీవి రాజతులు నగు, శ్రీగోల్కొండ నవాబుగారి సన్నిధికి. శ్రీ విజయనగర సామ్రాజ్యమంత్రి బుద్ధి సొగరుఁడు, అనే కాశీర్వచనములు:--

మీకు మా సైన్య సంబంధములగు ముఖ్యాంశముల నన్నింటిని జాగ్రత్త చేసి పంపుటకు నింక ను గొంతకాల మోర్వ వలసియున్నది. కొన్ని సిద్ధమైనవి. మఱి కొన్ని సిద్ధము కానున్నవి. బహుశః మీకుఁ ద్వరలోనే పంపఁగలనని సమ్ము చున్నాను. రాజ్యాంగ విషయములలో నిచట జాలరహస్యము

,