పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

విజయనగర సామ్రాజ్యము


యుండునో సరిగా నాకంతుచిక్కుట లేదు. పెక్కుమంది పెక్కు- విధములగాఁ జెప్పుచున్నారు. మీరా విషయమును గొం చెము జాగ్రత్తతోఁగంగొని వ్రాయింతురని నమ్ముచున్నాను. నేను నా సై న్యములోనికిఁ క్రొత్త సైన్యముం జేర్చుకొను చున్నాను. కాని విజయనగర సామాజ్య సైనికులతో మా సైనికులు పోరాడ లేరు. వారు పరాక్రమైకధనులు. అందుచే మాకు మిక్కిలి భయముగానున్నది. ఆదిల్ శాహాకును రాజు నకును భేదముగల్గించు నుపాయముఁ జూడుఁడు. మాతురకలలో మాకే కలియకుండ నున్నప్పుడు మీరు మాకుఁ జేయు సాహా య్యము విలువ చెప్పఁదీరదు. మాకుఁ బ్రతినిమేషము విజయ నగర సైన్యమెప్పుడు వచ్చిపడునోయని భయమే. నిద్ర లేదు. ఎప్పటి సంగతు లప్పుడు ముందు తెలుపవ లెనని వేడుటకన్న నేమియు విశేషము లేదు.

చిత్తగింపుఁడు."

అచటి సభాస్తారుల కెల్లరకు నేమియుఁ దోఁచలేదు. ఆశ్చర్యభావ మగ్నులైరి. కొందఱకు భయము పొడమెను. అందఱును రోషా వేశులు కాఁజొచ్చిరి. ఆ దురాత్ముని,ఆ పాపా త్ముని, ఆమాతృద్రోహిని, ఆ దేశ ద్రోహిని, ఆ నాజద్రోహిని, ఖండఖండములుగాఁ జేయవలయుననిరి. విజయనగర సామ్రాజ్య సర్వకార్య ధూర్వహులగు మంత్రులలో నట్టి ద్రోహులున్నా రన్న మాట కొందఱకు విశ్వసనీయముగాఁ దోఁచినది కాదు. ”