పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

68

విజయనగర సామ్రాజ్యము


గూర్చి రాజున కేమియుఁ జెప్పలేదు. అది యెట్లు వెల్లడి యగును ! అందులకుఁ గారణము కనంబడ కున్నది. ఇంతకు నకారణముగా నాకేమోగాని భయమేర్పడుచున్నది.” బుద్ధిసాగరునిపై నీపిడుగు పడునని యచటి పౌరులలో నొకఁడేని కలలో నేని యనుకొన లేదు. వారతనిని దమ తండ్రులను ప్రేమించినట్లు ప్రేమించిరి.

అంత నొకదీర్గకాయుఁడగు పురుషుఁడు లేచి నిలువ బడెను. అతనిముఖము గంభీరముగానుండెను. అతఁడివిధ ముగాఁ బలుకఁజొచ్చెను. “శ్రీ చక్రవర్తిగారి యుప్పునుదిను చున్న మన కెల్లరకు శ్రీవారియందు బితృభావమును రాజ భ క్తియును నుండుట ధర్మము. - శ్రీ చక్రవర్తి గారి సేవకులు నిన్న మొన్నటిదాఁక యుండిరి. కాని కొంతకాలము నుండియుఁ గొందఱు పెద్దమనుష్యులు రాజు ద్వేషులై పని సేయు చున్నట్లు కన్పట్టు చున్నది. వారు భటులకు దొంగ వేషములు వేయించి శత్రురాజులతోఁ గడుజాగ్రత్తగా నుత్తర ప్రత్యుత్తర ముల జుఱుపు చున్నారు. ఇది కొంత కాలము క్రిందట నేను నా గూఢచారుల మూలముగాఁ దెలిసికొంటిని. .మొట్ట మొదట నేనామాటలను విశ్వసింపలేదు. కాని క్రమక్రమముగా సమ్మవల సిన నాఁడనై తిని. నాకట్టి సిశ్చయమును గల్గించుటకుఁ దగిన కొన్ని కాగితములు దొరకినవి. ఇదిగో నిన్న సాయంత్ర మిట్టిది