పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

67


పాలితులకు నిత్య భీతి దాయకముగ దా! సభయెల్ల నిశ్శబ్దముగ నుండెను. అంత రామరాజు సక్రోధుఁడై యిట్లనెను. ‘విశ్వ విఖ్యాతమై శత్రు భీకరమగు నీ విజయనగర సా మ్రాజ్యమును బాలించు నధి కారులలో రాజద్రోహులున్నా రన్న సంగతి విన్నప్పటినుండియు నా యొడలు కంపమెత్తు చున్నది. నాపని కృష్ణసర్పమును ప్రేమతోఁ జేరఁదీసికొన్న విధాన నున్నది.”'

"పెక్కురు పెక్కువిధముల నాలోచించిరి. కాని యెవరి కేమియుఁ దోఁప లేదు. రాజద్రోహి యెవరైనది యెవరికి బోధ పడినది కాదుగాని, యచటివారిలోఁ జాలమంది తురుష్కుఁడౌ" టచేతనో, లేక యతనివర్తనము మంచిది కాదనియో, గాని, యాదిల్శాహా నుద్దేశించి, యాపిడుగతని పై బడునేమో యని భావించిరి. మఱికొందఱు మఱికొన్ని విధముల నాలోచిం చిరి. కాని యెవరు నిశ్చితార్థ మిదియని నియింపఁ గల్గిన వారు లేకుండిరి. ఆదిల్ శాహా అపుడచటనుండెను. యతఁడేమియు నెఱుఁగనివాఁడువోలె నాశ్చర్య మభినయిం చుచుఁ గూర్చుండెను. బుద్ధిసాగరుఁడు దూరదృష్టిగలవాఁడు. అతఁడిటు తలంపసాగెను.

“బహుశః ఆదిల్ సాహాయు, చక్రధరుఁడును నా పై బన్ని న తంత్రములా యేమి? లేనిచో నేనింతవఱుకు వారు సేయు కుట్రలం