పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

రాజద్రోహి యెవరు ?

విశాలమై సువర్ణ మయకుడ్యజాల తేజస్సమాకర్షిత సకల మానవలోకమై యత్యద్భుత శిల్పకళా సౌభాగ్య భాసు రమై నానావిధ రత్న నికర నిర్మిత వివిధ చిత్ర ప్రతిమా లంకృ తమై రాజిల్లు విజయనగర రాట్స భామందిరము, సకల సా మంత నృపాల సేవితమై నృత్యకళాకోవిద సంశోభితమై సకల లోకస్తుత్య విద్వత్కవి భాసురమై వందిమాగధ సమేతమై సకల దేశ సమాగత రాజప్రతినిధి యుక్తమై, హృదయరంజ కముగా నొప్పారు చుండెను. అందు మధ్య భాగమున రత్న ఖచిత కనక సింహాసనము నధిష్టించి రామరాజ చక్రవర్తి ప్రకాశించుచుండెను. అతని కనులు కెందామరలన లేఁ బ్రకా శించుచుండెను. ఆ మొగము తీరు కంగొన్న యచటి సామంత నృపాలురకును, భటులకును, పండితులకును, గాయకులకును, ఇంత యేల ! ఎల్లరకును గుండెలు పగులుచుండెను. మధ్యా హ్న మార్తాండుని చందమున నతని మోము తీక్ష కాంతులు గ్రక్కుచుండెను. ఒక్కొక్కఁడు తన కేమి మూడునోయని భయపడఁ జోచ్చెను. నిరంకుశ ప్రభువుల పరి పాలనము