పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తొమ్మిదవ ప్రకరణము

69

.

మరలనొకటి దొరకినది. దీనిని విన్న చో మీకు సత్యము బోధ పడగలదు."

అతఁడు రహస్యవార్తాసంగ్రహ శాఖాధికారి. అతఁడా యుత్తరమును జేతఁ దీసికొని మెల్లగా రామరాజు కడకు సమీ పించి యతని హస్తమున నుందుంచెను. అది శ్రీ చక్రవర్తి గైకొని సమీపమున నున్న పండితునొకని జదువ సన్న చేసెను. అతఁ డది గైకొని, ఇట్లుచదివెను . " శ్రీ రాజమాన్య రాజపూజితులయిన శ్రీ మహా మంత్రులవారి పాదపద్మములకు:—

శ్రీగోల్కొండ నవాబు వ్రాయు విన్న పము లేమనఁగా: అయ్యా! 'కొండంత దేవునకుఁ గొండంత పూజచేయఁ గలమా ? ' అనునట్లు వారు మాకుఁ జేయు నుపకృతికిఁ దగిన ప్రత్యుపకారముం జేయఁజాలక పోయినను మాయుడుతభ , నేని చూపఁ జాలకపోము.

మీరు మాయందు ననుగ్రహముంచి, మిరాజ్యమున నెప్పుడు జఱుగు సంగతు లప్పుడు తెలియఁ జేయఁ గోరుచున్నా ను. నేనిక్కడ గ్రమముగా నాదుర్గములను బాగుచేయించు కొనుచున్నాను. మీరు కొంతకాలమునుండి యుత్తరములు సరిగా వ్రాయించుట లేదు. కారణము దురూహ్యముగా నున్నది. విజయనగర సామ్రాజ్య సైనిక సంఖ్య యెంత