పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

విజయనగర సామ్రాజ్యము


గావు. మానవులు కారు! హర్షము, సౌభాగ్యము , మార్దనము, మాధుర్యము మొదలగునవి ! అది సామాన్య జనాగోచరము. అదియే మహా కవి సార్వభౌముల హృదయములకు గోచరించు నట్టి నూతన ప్రపంచము. మహాకవులందలి మృదుల భావములను, మాధుర్యమును. ........ తేనెటీగలు తేనెను గుసుమ సముదాయముల నుండి కూర్చి మికీడునట్లు సహృద యములఁ గ్రుమ్మిరింతురు. ఆ ప్రపంచములోని మెఱుఁగుల నన్ని టిని సేకరించి క్రొత్త మెఱుఁగులఁ జేర్చి విధాత మనోహర సృష్టిని జేయుచుండును.

ఇదిగో! ఇటుచూడుఁడు. ఆయుద్యానవనమున, ఆ మాధవీ మంటప మధ్యమున నొక సుందరీమణి కూర్చుండి యున్నది. ఆమె యాకృతి నిసర్గ మధురము. మనోహరము. సకల. జగన్మనోహరము. . పరిపూర్ణ శిల్పచాతురీ సారము, సంస్రా స్తనవ యౌవన విభ్రమము. సర్వోత్కృష్టము.ఆమె ప్రత్యంగమును సౌందర్య ప్రపంచమునందలి ప్రతివస్తువు నధఃకరించుచుండెను. ప్రంచమునందుఁ బూర్వము, నేఁడును, సృష్టింపఁబడిన నకల విలాసవతులను దలపోసి యందందుఁ గల లోట్లను దిద్ది క్రౌంక్రొత్త మెఱుంగులను జేర్చి సర్వసృష్టికర్త యైన యీశ్వరుఁడు చేసిన నూతన సుందర రత్నము. ఆకనుల సౌభాగ్యము నరయుఁడు ! నవ వికసితములయిన, నల్లకల్వల సౌరుగాని, తెల్ల దమ్ముల సౌభాగ్యముగాని సాటివచ్చునా ?