పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏ డ వ ప్రకరణ ము

ఆమె కాశలు గల్లెను


అనాఘ్రాతంపుష్పం, కిసలయ మలూనం కరరు హై
రనావిద్ధం రత్నం, మధుసవ మనాస్వాదితరసం
అఖండం పుణ్యానాంపల మినచ తద్రూపమనఘం
నజానే భోక్తారం కమిహసము పస్థాన్యతి విధిః !

.

అభిజ్ఞాన శాకుంతలము

పాఠకుఁడా ! నీ దృష్టి నొకసారి యీభౌతిక ప్రపంచము బరపుము. అది సకలవస్తు సముదాయము. నానావిధ తరు లతా సంశోభితము. వివిధ జంతుసంతాన వ్యాసము. దృగ్గోచ రము. జడము. బహువిధ పరిణమ ఫలము. అనిర్వచనీయమై, అగమ్యమై, అపారేశ్వర ప్రభావ ద్యోతకమై, కమనీయమై, ద్రష్టవ్యమై, విలాసవంతమై, ఆకృతిసి నీడయుంబో లె నెల్లపుడు నెడ తెగక యావిశాల విశ్వము నెల్ల నానరించుకొని కేవల సరస హృదయైక గోచరమగు నొక నూతన ప్రపంచము కలదు. అది నిత్యసంతోష సముదాయము. దు;ఖదూరము. సర్వ సౌభాగ్య సౌందర్యవస్తుసారము. మనోహరము. మృదులము. శాశ్వతము. సంతోషప్రదము. అందలి పాత్రలు జంతువులుగావు. పశులు