పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ప్రకరణము

49

అవి నిరుపమములు. తిరస్కృత హరిణీ విలోచన విలాసములు. ఆకర్ణాంతములు. అన్యదుర్లభ సకల లోక వశీకరణైక ప్రసిద్ధవి నూతన విలాస సంశోభితములు. విశాలములు.మనోహరములు. చూడుము ! నిష్కళంకమై నిరుపమానమై స్వాభావికచారు విలాస విశేషశోభితమై యాపె మొగమెంత హృదయంగమ ముగా నీదృక్పథమునలంకరించుచున్నదో! సంపూర్ణ రాకామృ గాంకు నా మొగముతో సరిపోల్పవచ్చునా ? నవ వికసిత హేమ సహస్రపత్రమేనియా సౌందర్యమునకు సాటివచ్చునా? మనకుఁ బక్ష పాతమున కవకాశము లేదు. ఆ కమలముగాని, సుధాక రుఁడుగాని, యీసుందరీమణిగాని, మనకుఁ జుట్టములుగారు. ఆ యధర మెంత రమణీయము ! బింబ ఫలమా దానికి సాటి ? ఉపమాలంకారము చాల ప్రియమైన దేకాని ప్రపంచము గొడ్డు పోయినదా యేమి ? మనకా సౌందర్యవతి యంగములతో బోల్చుటకు నొక్క వస్తునైన దొరికినది కా దేమి ? ఆ సురచిరములగు కోమల కరముల నరయుము ! అవి యెంత మార్దవములుగా నున్నవి! నల్లని పట్టుకుచ్చులకంటే స్నిగ్ధము లై, మనోజ్ఞములై , సాంద్రములై తోఁచుచున్న యా శిరోజములు కన్ను లారఁజూడుము. సర్వలక్షణ సముపేతమై, సకలలోక సమ్మోహనమై, అన్ని టినిమించి పొడసూపుచున్న యాన వమందహాసాంకురమును విలోకింపుము. వీని కన్నిటీ