పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూఁడన ప్రకరణము

23


మ్మదీయ మతమునకై సేయుపనికి మన . రాజ్యముల వారెల్ల రుఁ దోడ్పడుదురని నమ్ముచున్నాఁడ. దేవుఁడయిన యల్లా తప్పకయిందు సాయము చేసి తీరును. ఏలయన నిది న్యాయమైన కార్యము. కాఫరులు రాజ్యము సేయుటకు తగువారు గారు. మనలో మనకు సరిగాఁ గుదురకుండుటచేతఁగాదా యిట్లు? దేశమెట్ల హిందూరాజులు రాజ్యముల నేలుచున్నారు. ఆ విజయనగర సామ్రాజ్యము పేరు విన్న గుండెలు పగిలిపోవు చు న్నవి. ఎంత సామ్రాజ్యము ! ఎంతసామ్రాజ్యము ! ఏమి వైభ ము! అది మనకుఁ బ్రక్కలోని బల్లెము. దానినలన మన మెన్నీ కష్టములను బొందుచున్నదియు దైవమున కెఱుక. నిన్న మొ న్న నే సన్నుఁ బెట్టిన పాట్లు మీ రెఱుఁగరా ! ఇంతియేగాక గత యుద్ధములలో విజయమందిన హిందూ సైనికులు మనకు ను మన మతమునకును జేసిన యపకారములు.......... చెప్ప శక్యము గాదు. నిజముగా మన మతమును మనము రక్షించుకొనవలసి యున్నది. అది యల్లాకుసమ్మతము.కాని మీరన్నట్లు వారిని యుద్ధములో జయింపలేము. స్నేహము సటించుచు నే వంచించి ఆ యంధ్రవీరుల పేర్లు తలఁపఁగ నే గుండెలు ప్రక్క లగుచున్నవి! అట్టిసామ్రాజ్యము తోడను, ఆ సైనికుల తోడన మన మెల్ల రమునుగూడఁగలిసి యెదుర్కొనినను జయింపఁజూలము. ఇపుడు మీ

విజయమందవలెను.