పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

విజయనగర సామ్రాజ్యము


అతని మొగము బంగారు చాయగలది. అందు రాజకళ- లగుపడుచున్నవి. అతనిని మనము చూచియుండ లేదుగాని యిదివజుకతని గూర్చి పెక్కు సార్లు వినియున్నాము. అతఁడే యాదిల్ శాహా. అతఁడు మనగోల్కొండ మంత్రికొఱ కెదురు సూచుచుండెను. ఇంతలో నొకభటుఁడతనిం దనవెంటఁ బెట్టు కొని తీసికొనినచ్చి సవాబు నతనికిఁ జూపించి పోయెను.

ఆదిల్ :- ఓహో ! తారానాధులుగారూ! తమకొఱకే యెదురు చూచుచుంటిని. సమయమున కేవచ్చినారు.మీకునూ ఱేండ్లాయువు. మిమ్ము నల్లా రక్షించునుగాత !

తారా:- నాకన్నులు ధన్యతంగాంచిననండీ ! నేఁడు సుదినము మీదర్శన భాగ్య మబ్బుటచేత.

ఆదిల్ : చిత్తము. కార్యమేమి చేసికొని వచ్చినారు. శ్రీగో ల్కొండ నవాబుగారికి క్షేమ మేగదా? తా:- పై సంగతులు మాటలాడుకొందము. ముందీ యుత్త రముఁ జదువుకొనుఁడు.

అని యతఁడొకయుత్తరముందీసి దూదిల్ శాహా కరమున నుంచెను. అతనికి నాతురత హెచ్చెను. తోడనే యతఁడు దీపము వెలుఁగునఁ దనలోఁ దానిట్లు, చదువుకోసం జో.చ్చెను.

మిత్ర శేఖరా ! మీరు వ్రాసిన యుత్తరమందినిది. మీ యుద్దేశ్యమెంతయు సం స్తవనీయ మై యున్నది. మీరు మహ "