పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

విజయనగర సామ్రాజ్యము


కడకు దారానాధునంపితిని. మీరు సమయోచితముగా నేది యోపన్ని ఇతనిని రామరాజు సేనలోఁ జేరునట్లు సేయుదురని వేఱుగాఁ జెప్పవలయునా! మీరక్కడ మిత్రభావముతోడను, పుత్త్ర భావముతోడను, ఉండి శత్రువుల గుట్టు తెలిసికొనుట మన కెంతయుఁ బ్రయోజనకారి. . క్రమక్రమముగా నది యెల్ల నుజదువుకొనునప్పటి కాదిల్ శాహా మొగము పోడశకళాపరిపూర్ణమయిన చంద్రబింబము వలెఁ బ్రకాశింపఁజొచ్చెను. అతని మొగమునఁ జిఱునగవు దోచుచుండెను.

అతఁడు మిగుల జిత్తులమారి. అతనికి నిశ్చయముగా మత మునందు భక్తి లేకపోయినను మతావేశమును గల్గించినఁగాని తురుష్కు లెల్లఱును జేరరని తంత్రముపన్నెను. మతము మిక్కిలి భయంకరమయినది. మతకక్షలచేఁ బ్రపంచమున నెన్ని యో సామ్రాజ్యములు నశించినవి. అనేక లక్షుల జనులు మత యుద్ధ ములలోఁ దమ ప్రాణములను నిశ్చింతగా వదలిరి. ఈ కాల మున మనకంతగా మతపుఁబిచ్చి లేదు. కానిపూర్వమట్లుగాదు. మతమునకుఁ బ్రాణము లర్పించువారు. ఆకారణముచేతను దురుష్కులు తమ్ము పెట్టిన బాధలకుఁ దగిన ప్రతీకారము నేయవలయునని హిందువులు గతించిన రెండుమూఁడు యుద్ధ ములందుఁ గల్గిన విజయములలో మహమ్మదీయులను జాల