పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలువది యొకటవ ప్రకరణము

303



జలపూరితములాయెను. కాని అతఁ డంత స్తంభన మాచ రించెను.

అయ్యా ! మీరు చెప్పకయున్న నే నాగఁజాలను. . కరుణింపుడు.' అనెను.

ఆ యోగి మెల్లగా నిట్లనెను.

మీరిపురెవరికొఱకు నిరీక్షించుచున్నారో అతఁడే యితఁడు

బుద్ధి సాగరులా మీరు ? ”

'అవును ” అనెను.

ఆ ముదుసలి చక్రవర్తి కండ్ల నీరు గ్రమ్మెను. ఆనం దముదుఃఖము — పశ్చాత్తాపము అతని ముఖమున వ్యక్త ము లగుచుండెను. అతఁడేడ్చెను. “ నన్ను క్షమింపుడు ' అని యొక నమస్కారముం జేసెను. వలదని బుద్ధిసాగరుఁడు వారిం చెను. "కొని యతడు వినలేదు. ఇట్ల నెను.


“అయ్యా ! విశ్వాస ద్రోహిని. పాపాత్ముఁడను. నేను సుప్రసిద్ధ మగు విజయనగర సామ్రాజ్యమును నా చేతిలోఁ బాడు చేసితిని. మీ వంటి విశ్వాస పాత్రులగు మంత్రివరుని మాటలను జెవింబెట్టసయితిని.

నాయుత్కృష్ట సామ్రాజ్యముం జూచుకొని గర్వించితిని. ఆదిల్ శాహాను సమ్మతిని.._చక్రధరుని నమ్మితిని- తత్సమునెల్ల ననుభవించితిని.