పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

విజయనగర సామ్రాజ్యము



యో చేయుదురు. పిమ్మట విచారింతురు. కాని విచారించిన లాభముండునా ? చెడిపోయిన కార్యములు మరల బాగు వడునా ! గతించిన వాఁ డెన్నటి కేని తిరిగి జీవించునా !


అతఁడాయోగి వంక తన దృష్టిని సారించెను. ఆ యోగి ముఖమతనికి నకారణముగాఁ బ్రీతినొసంగు చుండెను. అతఁ డా యోగివంకఁ జాల సేపవలోకించెను.ఇతఁడే బు సొగ రుఁడా యేమి?" అని యనుకొనెను “ అతఁడు కాడు' అని తర్కించెను. " లేనిచో నితనియందు బుద్ధి, సొగరుని తీరు చాల కనుపట్టు నేమి ?' అని మరల వితర్కించెను.


భ్రమ విచిత్రమైనది. మన మవశ్య "మొక పురుషునిం జూడఁగోరు నెడల మన మెచ్చటి కేగినను, ఏదిక్కు జూచినను ఏ చెట్టుం గల్గొన్నను, ఏ పుట్టను వీక్షించినను, ఏ మొగముం గల్గొన్నను, ఆపురుషుని ముఖమే యతని లక్షణములే గోచ రించుచుండును. అది మనమనస్సు యొక్క వికారము. అదియే భ్రమ...


అతఁడిపుడు బుద్ధిసాగరుంజూడ నభిషింలపించెను. అతడు కట్టెదుటఁ గన్పించుచున్నట్లుండెను. సంశయగ్రస్తుఁ డాయెను. మెల్లఁగా నిట్లనియెను.

“ అయ్యా ! మీ రెవరు? "

ప్రత్యుత్తరము రాలేదు. అతని మనస్సాందోళనము నందుంచుండెను. ఆ యోగి హృదయము భేదింపఁబడెను. కండ్లు