పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

304

విజయనగర సామ్రాజ్యము


నాఁడు సభా భవనమున మీరు చెప్పిన వాక్యరత్నము లెల్ల వేదాక్షరములు. అవి జరిగితీరినవి. గతించిన వెన్క జింతించిన నేమి ప్రయోజనము !


విజయ నగరమువంటి విస్తీర్ణితం గాంచిన సుప్రసిద్ధ సామ్రాజ్యమును ధ్వంసము చేసినందులకు నన్నెంతగా భవిష్య దాంద్రులును, భారతీయులును దూషింతురోగదా? నిశ్చయముగా — నే నందులకుం బాత్రుఁడను.


ఏ నాఁడు నిసుమంత కష్టములను సనుభవించి యెఱుం గని నా సామ్రాజ్య ప్రజలే నె కష్టముల నందుదురో కదా ! దైవమా ! ఎంతటి విపత్తులం దెచ్చి బెట్టితివి ? తురు ష్కుల పేరునే విసని నా సామ్రాజ్య ప్రజ లింక నేమగుదురో ! అయ్యో ! విజయనగర పట్టణము "నేగతి "నేమగునో ? ఆ మహా నగరము నాశమందవలసిన దేనా ?

చీ ! ఈ తుచ్ఛ ప్రాణమును విడిచెదను. పోయివచ్చె దన'. నాతప్పులను మన్నించి నను రక్షింపుము.' అని కడసారి బుద్ధిసాగరుం బ్రార్థించెను.


“దేవా ! ఏ చింతించెదరు! . నన్నేల స్తుతించెదరు? నావిధిని నేను నెరవేర్చితిని. కాని ఎక్కువ నేనేమియుం జేసి యుండలేదు. సామ్రాజ్యములు సంచుట వృద్ధి చెందుట ఈశ్వర సంకల్పము ననుసరించియుండును. అది మన వశము కాదు అని చెప్పుచుండెను. కానీ రామరాజ చక్రవర్తి యింక వినం