పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదితొమ్మిదవ ప్రకరణము

293



చుండిరి. రెండు కక్షులకును పోరుజరుగుచుండెను. ఒక వాఁడి యగు ఖడ్గ మెగిరి రామరాజుతల పైన తఁడింకను లేవకమున్నే పడఁబోవుచుండెను. కాని యింతలో ఖడ్గముతోఁ గూడ, నొక తురుష్కుని చేయి తెగి నేలపైనం బడెను. ఆ కొట్టిన దెవరు ? విజయసింహుఁడు !


అతని వెంట యోగియుండెను. ఆయోగివెంట మఱి యొక యౌవన వీరుఁడుండెను. రామరాజుం జంప సిద్ధముగా నున్న తురుష్కుని హస్తమును నటికి నందులకుఁ గోపించి మఱి యొక తురుక విజయసింహుని పైన ఖడ్గమును వెనుక ప్రక్క నుండి విసరెను. ఆ దెబ్బ వచ్చి యతని యెడమ మోచేతి పై భాగమును రెండుతుండెములుగాఁ జేసెను.


ఆ చేతివంక నావీరుఁడు చూచుకొనఁగానే అతనికిఁ బౌరు షము హెచ్చెను. తీడ్రిండ్రించు చున్న యుత్తమ హర్యక్షముగతి నతఁడు విజృంభించెను. అతని కనులు రక్త మయము లాయెను. అతఁడా గాయమునకు గట్టు గట్టి మరల తురుష్క సేన పైన ద్విగుణీకృతమైన పరాక్రమముసం గవిసెను. ఆమూర్తి భయం కరము. "కాలానల, జ్వాలాసన్నిభము. అతఁడపుడు రెండవ రుద్రునివలె నుండెను. యతనికిం గ్రమక్రమముగా నాయాసము హెచ్చను. ఒక తురుష్క వీరుఁడువచ్చి తన ఖడ్గ మును సరిగ " బ్రక్కనుండి యతని కంఠము పైన విసరెను. ఇంతలో హిందూయౌవను పురుషుఁడొకఁడా దెబ్బను.