పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

292

విజయనగర సామ్రాజ్యము


ఆయోగి కాలుందీసి ముందుఁ బెట్టగనే రాజుగారి మా వటి వాండ్రకు చక్రధరుఁడేదో సంజ్ఞ యొక్కటి చేసెను. ఆసంజ్ఞను దైవ వశమున రామరాజు చూచెను. కాని వ్యవధి లేదు. వెంటనే ఘోరఖడ్గ, మొటివచ్చి యూతని వెన్నెముక ప్రక్కందాఁకి గొప్పగాయము చేసెను.


రామరాజు స్పష్టముగాఁ జక్రధడు చేయు సంజ్ఞను జూడఁ దటస్థించుటం జేసియు, వెంటనే యాతడను కొన్నట్లు వ్యవధి లేకుండఁ దనకు ఖడ్గ, ప్రహరము తగులుటం జేసియు, చక్ర ధరుని సంజ్ఞ యొక్క అర్ధమును సంపూర్ణముగ గ్రహించెను. కాని నిముసములో చక్రధరుఁడు లేకుండ బోయెను.అతఁడే దారి నెట్లు పోయెనో ఆకష్టకాల్లములో నవరును గన్పెట్ట జాలవైరి.


దైవికమను నత్యద్భుతః యొకటి కలదు. దాని తత్వ మును మన మెఱుంగము. కాని యొక్కప్పుడు కలనైన మనము తలంపని కష్టము లెల్ల మనకు గల్గును. మఱియొక వేళకాఱు మేఘములట్లు, క్రమ్ముకొనియున్న మహాకష్ట పరంపర నిముసములో మాయమై పోవును. ఆకష్టమెందు వలన సంభవించునో మనకు గోచరము కాదు.


ఇంతలో దైవ వశమున పవశమున రామరాజెక్కిన యేనుగు బెద రెను. అది యతనిం బడద్రోసెను. అతడు నేల పైనంబడెను. అతని చుట్టును హిందువులును దురకలును గుమికూడు