పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

విజయనగర సామ్రాజ్యము


తాను కాచుకొనెను. పాపమతనికిం బలమైన గాయము తగిలెను. ఆ యిరువుకును మూర్ఛిల్లిరి. శ్రీధరుఁదు వారినఁటనుండి తప్పించి వేసెను.


రామరాజును మూర్ఛిల్లెను. అతనిని యోగి రక్షించి దూరముగాఁ గొనిపోయెను.కాని రామరాజు బ్రదుకునట్లు తోచలేదు.


ఇంతలో “ రామరాజుచచ్చె. రామరాజు చచ్చె' అని తురుష్కులు కేక లిడిరి. హిందువులు నిజముగా" సతఁడు చచ్చె ననుకొనిరి. తురకల కేకలును ఆర్పులును మిన్ను ముట్టుచుండెను. క్షణములో సైస్యము నాల్గుమూల నావార్త వ్యాపించెను. హిందువులు చెల్లా చెదరయి పోయిరి. కొందఱతని కొజుకు వెదకుచుండిరి. తురుష్కులు వెంటఁబడి నరుకు చుండిరి. తిరుమల రాయలా వార్తను వినఁగనే సహింప నేరక అతనిం జూడవలయునని రామరాజున్న వైపుసకు రాదొడం గెను. అతనింగూడ మోసపుచ్చి తురకలు నరికి వేసిరి.


అన్న గారి చావు తెలిసి వేంటాద్రకూడ సతనింజూడ వచ్చుచుండెను. అతని నొకతురుష్క యోధుఁడు వెంబ డించెను. ఆ యిరువురును ఘోరముగా బోరిరి. ఆ తురుష్క యోధుఁడు గతించెను. కాని మఱియొకడువచ్చి వేంకటాద్రి తల పైన నొక పెద్ద దెబ్బకొట్టను. అతని తల రెండు ప్రక్క లాయెను. శక్తితగ్గుచుండెను. అయినను సహించి యాతురకం