పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియాఱవ ప్రకరణము

279


స్థానమును నాఁడును నేఁడును వహించిన కమ్మ, వెలమ, రెడ్డి నాయకుల యశస్సా యుద్ధభూమియందు స్తుతి పాఠకుల చేతను బట్టులచేతను బాడఁబడుచు ఆయుద్ధ వీరుల దేహములను మఱచు నటు చేయుచుండెను.


వారి పౌరుషము, బలము, తేజమునూత్న జప సత్వములను దాల్చుచుండెను.ఆ వీరుల కప్పుడు తండ్రులుగాని తల్లులుగాని పిల్లలు గాని మఱేవిగాని స్ఫురించుట లేదు. ' స్వదేశ రక్షణ, స్వదేశ రక్షణ' యని వారి హృదయములు జపించుచుండెను. శరీరములోని, ప్రతి నాళమునందును శౌర్యము స్ఫురించుచుం డెను.


తురుష్కులెల్లరును మహమ్మదీయమత రక్షణము. మహమ్మదీయ మత రక్షణ మని మంత్రించుచుండిరి. హిందు వులను నాశనమే ముందు నను . మ తమ మతమును రక్షింపుమని అల్లాను బ్రార్దించు చుండిరి. "కాఫరులను జంపి స్వర్గలోకమును బొందుఁడు అని ప్రోత్సహించుచుండిరి. మఱి కొందఱు అల్లాయె తమకు ప్రత్యక్షమయ్యెననియుఁ దమకే విజ యము సంప్రాప్తమగునని సెలవిచ్చినాడనియుఁ జెప్పి మహ మ్మదీయుల నాహ్లాదమును సంతోష తరంగముల యందు ముంగు నట్లు చేయు చేయు చుండిరి.


యుద్ధములు ఈశ్వరుడు మానవులకిచ్చిన శాపములని చెప్పవచ్చును. లక్షలు లక్షలుగా జనులు నశింతురు. దేశము