పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

విజయనగర సామ్రాజ్యము

అలా

కొనుచుండిరి. కొందఱు పర్వెత్తుచుండిరి. కొందఱు వారి వెం టఁబడి తరుముచుండిరి. కొందటితరులజుట్టు పట్టుకొని లాగుచుండిరి. మఱికొందఱు లాగఁబడుచుండిరి. కొండఱు బాహువులతో, బోరుచుండిరి. కొందఱుక్రోధావేశమున నితరుల ఱొమ్ముల పై నెక్కి.. పక్షస్థలమ్ములంజీరి ప్రేపులం జించి తమకు జందెము లుగాఁ జేసికొని ద్వితీయ నృసింహావ తారులై ప్రవర్తించు చుండిరి.


రణశిక్ష కుశలులగు కొంద రితరులు తమ్ముంగొట్టు: దెబ్బల నన్నింటిని దప్పించుకొనుచు వెనుకకు ముందుకు ప్రక్కకుఁ దిరుగుచు, ఇచ్చవచ్చినవిథాన నల్దిక్కుల మసంగి భటులు తలలఁను జిత్రచిత్ర ప్రకారములం బంట పైరులఁగోసిన చందానం గోయుచుండిరి. బట్టులు వరుసలుగగూడి వీరుల యుత్తమగుణములను శౌర్య ధైర్యములను గానముచేయుచు వారి భులరక్త నాళము యందు సూత్నరక్తముం బ్రవ హింపఁ జేయుచుండిరి.


ఆంధ్రదేశ మాతయొక్క విశుభ్రయశ స్సంపదలను బొందించుటకుఁగాను పూలబంతుల నొసంగునట్లు, తమ శిరఁబుల నొసంగి త్రిలింగ రాజ్యలక్ష్మిని విస్తరింపఁ జేసి, యా రాజ్యమందు దురుష్కులు కాలు పెట్టకుండునట్లు కావించి, రాజ్యములుచేసి సేనానాయకత్వములను వహించి5, మంత్రి పదవులంబడసి యాంధ్ర భూమియందుఁ బూజ్యతను, ఉత్కృష్ట