పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

280

విజయనగర సామ్రాజ్యము


బందిపోట్లు హెచ్చును. అరాజక మగును. కోట్లకు కోట్లు ధనము వ్యయ మగును. దేశములో నెలకొనియున్న శాంతి నశించును.


కొందఱకుఁ గాళ్ళు పోయినవి. మఱి కొందఱకు వేళ్లు తెగినవి. కొందఱకు ముక్కులు చెక్కలైనవి. కొందఱకుఁ బాదములు పొడయినవి. కొందఱుకు తొడలు తెగినవి. కొంద అ హస్తములు పోగొట్టు కొనిరి. పాపము! వారి బాధలంజూడు ము! కొందఱు గిలగిలమని కొట్టుకొనుచున్నారు. కొందఱు తెగిన యంగములవలనం గల్గిన బాధ సహింపలేక తమకుఁ దామే పొడుచు కొని చచ్చుచున్నారు.