పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పది రెండవ ప్రకరణము


నార్థమ చక్కఁగాఁ జిత్రింతురు. కవులవలెనే చిత్రకారులును జిత్రించునప్పుడు స్వభావాతి శయోక్యోలంకారముల సాయము వహింతురు. కాని యీచిత్తరువు నందతని దివ్యమూర్తి సం పూర్ణ సౌభాగ్యము అతిశయోక్తింజెందక యున్నను కొఱఁత నొందియుండ లేదు."


'అతఁడిపుడు విజయనగర సైన్యములలోఁ గృష్ణ కావల ప్రక్కనుండును. పోయి తీసికొని వచ్చెదను. అందు కేమి చేయు మందువు”

'అబ్బా! నాకిపు డేమియుఁ దోఁచుట లేదు. మన స్సెంత యు నలసియున్నది. ఇపుడు నేనేమియుఁ జేయఁజాలను.”